టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

Team India
Team India

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది ఆటగాళ్లతో టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ టీ20 సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనికి చోటు దక్కలేదు. కాగా, తాజా విండీస్ పర్యటనకు దూరంగా ఉన్న యువ ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లకు కూడా ఈ టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించిన బిసిసిఐ.. యువ బౌలర్లు ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు అప్పగించింది. కాగా, ఈ సిరీస్ కు ధోనీని ఎంపిక చేయకపోవడంపై ఛీఫ్ సెలెక్టర్ ఎమ్ స్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ధోనీకి అవకాశం కల్పించలేదని పేర్కొన్నాడు.

టీమిండియా టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైని.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/