ఇండియా ఓపెన్‌ ఫైనల్లో మేరీకోమ్‌

mary kom
mary kom

ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్స్‌ పోరులో మేరీ 4-1తో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను ఓడించింది. ఆరంభంలో మేరీకోమ్‌పై నిఖత్‌ పైచేయి సాధించింది. ఈ సమయంలో ఆచి తూచి ఆడిన మేరీ..మూడో రౌండ్లో ఎదురుదాడికి దిగింది. దీంతో జడ్జీలు ఆమెనే విజేతగా ప్రకటించారు. ఓడినా నిఖత్‌ జరీన్‌ కాంస్య పతకం సొంతం చేసుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/