పీకల్లోతు కష్టాల్లో భారత్‌

4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

INDIA vs NEWZEALAND
INDIA vs NEWZEALAND

మాంచెస్టర్‌: న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌లో 240 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేవలం 5 పరుగుల స్కోరుకే 3 వికెట్లు చేజార్చుకుంది. రోహిత్‌ ఔటయిన తర్వాత వచ్చిన విరాట్‌ కూడా సింగిల్‌కే స్కోరుకే పెవిలియన్‌ దారి పట్టాడు. రోహిత్‌ శర్మను, లోకేశ్‌ రాహుల్‌ను, దినేశ్‌ కార్తీక్‌ను మాథ్‌ హెన్రీ ఔట్‌ చేయగా, విరాట్‌ను బౌల్ట్‌ ఎల్‌బిడబ్లూ చేశాడు. 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 38 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌పంత్‌( 19 ), హార్థిక్‌ పాండ్యా(5)లు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/