టీమిండియా టార్గెట్‌ 240 పరుగులు, రోహిత్‌ ఔట్‌

Rohit Sharma
Rohit Sharma


మాంచెస్టర్‌: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మళ్లీ మొదలైన ఆటలో కొద్దిసేపటికే 3 వికెట్లు వరుసగా పడడంతో కివీస్‌ ఖంగుతింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడిన కివీస్‌ 8 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు టార్గెట్‌ 240 పరుగులయ్యింది. ఇండియా కూడా తన బ్యాటింగ్‌ను ప్రారంభించింది. 2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 5 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(1) మాథ్‌ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారి పట్టాడు. ప్రస్తుతం క్రీజులో లోకేశ్‌ రాహుల్‌(1), విరాట్‌ కోహ్లి(1)లున్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/