నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌

IND vs NZ practice match
IND vs NZ practice match

లండన్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా కెన్నింగ్‌టన్‌ ఓవెల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో రెండో బంతికి రోహిత్‌ శర్మ(2) ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో శిఖర్‌ధావన్‌(2) టామ్‌ బ్లండెల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే లోకేశ్‌ రాహుల్‌(6) బోల్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో విరాట్‌ కోహ్లి, పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ గ్రాండ్‌హోం వేసిన 11వ ఓవర్‌ మూడో బంతికి కోహ్లి(18), క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 53 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా(16), ధోని(5)లు ఉన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/