టీమిండియా దెబ్బకు బంగ్లా ఢమాల్‌

test cricket
test cricket

ఇండోర్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. భారత బౌలర్లు తమ విజృంభణ కొనసాగిస్తుండటంతో బంగ్లాదేశ్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో లంచ్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌..ఆపై టీ బ్రేక్‌కు వెళ్లే సమయానికి మరో నాలుగు వికెట్లను కోల్పోయింది. ప్రధానంగా అశ్విన్‌, మహ్మాద్‌ షమీలు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ 41 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఇంకా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సీనియర్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ 104 బంతుల్లో 43 స్కోర్‌ చేయగా మోమినల్‌ హఖ్‌ 80 బంతుల్లో 37 స్కోర్‌ చేసారు. లిటన్‌దాస్‌ (21) మినహా ఎవ్వరూ 20కి పైగా స్కోర్‌ చేయలేదు. మహ్మద్‌ షమికి 3 వికెట్లు దక్కాయి. ఇషాంత్‌, ఉమేష్‌, అశ్విన్‌ తల 2 వికెట్లు తీశారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/