యో-యో పాస్‌ మార్కులు పెంచనున్న రవిశాస్త్రి…

ravi sasthri
ravi sasthri


ముంబయి: అంతర్జాతీయంగా ఆమోదించబడిన యో-యో టెస్టును భారత క్రికెట్‌ జట్టు ఆటగాడి ఫిట్‌నెస్‌ను కొలవడానికి ఒక మార్గంగా అనుసరిస్తుంది. ఇందులో భాగంగానే టీమిండియా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా రెండోసారి ఎంపికైన రవిశాస్త్రి దక్షిణాఫ్రికా సిరీస్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. ఫిట్‌నెస్‌ విషయంలో ఆటగాళ్లు మరింత శ్రద్ధ పెట్టాలని మార్పలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న యో-యో టెస్టు స్కోరు 16.1ని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పెంచే ఉద్ధేశ్యంతో ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అర్హత స్కోరును 17కు పెంచాలని శాస్త్రి భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే బిసిసిఐ, ఆటగాళ్లతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నాడట. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు పోటీపడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఇందులో భాగంగానే కనీస అర్హత స్కోరు 17గా ఉండాలని రవిశాస్త్రి అన్నారని సమాచారం తెలిసింది. సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతోనే ఈనిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గురువారం ఆటగాళ్లు, కోచ్‌, సహాయ సిబ్బంది అందరూ ఢిల్లీలో సమావేశం కానున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/