ఆక్లాండ్‌లో అలరిస్తున్న కోహ్లీసేన

Team india
Team india

ఆక్లాండ్‌: సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి 5 టీ 20 ల సిరీస్‌ ఆరంభం కానుంది. గాలులతో కూడిన చల్లటి వాతావరణానికి అలవాటు పడేందుకు కోహ్లీ సేన ప్రయత్నిస్తోంది. బుధవారం జిమ్‌ సెషన్‌లో కసరత్తులు చేసిన తర్వాత బ్యూటిఫుల్‌ ఆక్లాండ్‌లో పసందైన విందు ఆరగించినట్లు ట్విట్ట‌ర్లో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండేలతో లంచ్‌ చేస్తుండగా సెల్ఫీ తీసిన ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్నారు. కివీస్‌ పర్యటనలో భారత్ ఐదు టీ 20 లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/