ఇమ్రాన్‌ తాహిర్‌ వన్డేలకు గుడ్‌ బై

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (40) కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2019 ప్రపంచకప్‌ తర్వాత వన్డేల నుండి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. దక్షిణాఫ్రికా తర్వాతి తరం స్పిర్నర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇమ్రాన్‌ చెప్పాడు. అయితే ప్రపంచకప్‌ తర్వాత టీ20ల్లో కొనసాగుతానని తెలిపాడు. పాకిస్థాన్ జాతీయుడైన తాహిర్ 2011 ఫిబ్రవరి 24న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తరపున వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడిన ఆయన 156 వికెట్లు తీశాడు. 146 పరుగులు చేశాడు.