15 రోజుల్లో క్రికెటర్‌ షమి లొంగిపోవాల్సిందే

shami
shami

కోల్‌కత్తా: భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమిపై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. గృహహింస కేసులో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నుంచి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని షమిని పశ్చిమ బెంగాల్‌ కోర్టు ఆదేశించింది. దీనిపై బిసిసిఐ స్పందించింది. ప్రస్తుతం షమిపై ఎలాంటి చర్యలు తీసుకోమని, అభియోగ పత్రాలు అందేవరకు వేచిచూస్తామని తెలిపింది. దీంతో షమి భార్య హసీన్‌ జహాన్‌ మీడియాతో మాట్లాడుతూ షమికి బిసిసిఐతో పాటు స్టార్‌ క్రికెటర్లు మద్దతుగా ఉన్నారని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని, ఆశారాంబాపు వంటి వారే చట్టం నుంచి తప్పించుకోలేకపోయారని అన్నారు. తాను న్యాయంగా పోరాడుతున్నానని, న్యాయమే గెలుస్తుందని, ఈ నిర్ణయంపై తాను ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చిలో షమీతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ హసీన్‌ జహాన్‌ గృహహింస కేసు పెట్టిన విషయం విదితమే.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/