ఇంగ్లాండ్‌ జట్టే ఫేవరెట్‌

glenn mcgrath
glenn mcgrath

ఇంగ్లాండ్‌ జట్టే తన ఫేవరెట్‌ అని, ప్రస్తుతం ఆ జట్టు ఫామ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌ గెలిచేలా ఉందని ఆసీస్‌ మాజీ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ తెలిపారు. మే 30 నండి మెగా సమరం జరగనుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మాజీలు తమ ఫేవరెట్‌ జట్లు ఏదో, ఏ జట్టు కప్పు గెలుస్తుందోనని తమ అభిప్రాయాలను తెలిజేస్తున్నారు. తాజాగా మెక్‌గ్రాత్‌ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కప్పు ఖచ్చితంగా ఇంగ్లాండే గెలుస్తుందని కాదు, సొంతగడ్డపై వారిని ఓడించడం కష్టమేనని అన్నాడు. ఐతే భారత్‌కు కూడా ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా సైతం బాగా ఆడుతుందని, దక్షిణాఫ్రికా, ఎప్పటికీ మంచి జట్టే, పాక్‌, వెస్టిండీస్‌ ఎప్పుడు ఎలా ఆడుతాయో తెలియదు. అందుకే ఈ ప్రపంచకప్‌ అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ఆస్ట్రేలియాను ఫైనల్లో తప్పకుండా చూస్తానని మెక్‌గ్రాత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/