నా జెర్సీపై ఉండే భారత్‌ వల్ల ఇలా ఆడుతున్నా: కోహ్లీ..

kohli
kohli


మొహాలి: నా జెర్సీపై ఉండే భారత్‌ పేరు వల్లే ఇలా ఆడుతున్నా. దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వకారణమే అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత్‌ బోణీ చేసింది. రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. అర్థసెంచరీతో మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్‌కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ…సంజ§్‌ు మంజ్రేకర్‌ నా టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ఆటను గుర్తుచేశారు. దాని నుంచి నాకు ప్రేరణ వచ్చింది. అలాంటి మ్యాచ్‌ ఆడి జట్టును గెలిపిస్తే ఎప్పటికీ మంచి అనుభూతే. ఆ రాత్రి (2016 ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా) క్రికెట్‌ మైదానంలో ఎంత ఫిట్‌గా ఉండాలో తెలిపిందని కోహ్లీ అన్నాడు. నా జెర్సీపై ఉండే పేరు (భారత్‌) వల్లే ఇలా ఆడుతున్నా. దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వకారణం. బరిలో దిగాక చేయాల్సింది అంతా చేస్తా.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/