సుప్రీం తీర్పును బిసిసిఐ గౌరవిస్తుందని ఆశిస్తున్నా

sreesanth
sreesanth


న్యూఢిల్లీ: 42 ఏళ్ల వయసులో లియాండర్‌ పేస్‌ గ్రాండ్‌స్లామ్‌ గెలిచినపుడు 36 ఏళ్ల వయసులో నేను అద్భుతాలు సృష్టించలేనా అని టీమిండియా వెటరన్‌ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ ధీమా వ్యక్తం చేశాడు. బిసిసిఐ తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీం పక్కకు పెట్టి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..2013 ఐపిఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ముంబై స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌, హరియాణా క్రికెటర్‌ అజిత్‌ చండీలా సహా శ్రీశాంత్‌పై బిసిసిఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

sreesanth family
sreesanth family


తన జీవిత సర్వస్వమైన క్రికెట్‌కు ఆరేళ్లు దూరమయ్యాను, దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును బిసిసిఐ గౌరవిస్తుందని భావిస్తున్నాను. క్రికెట్‌ మైదానంలోకి మళ్లీ తనను అనుమతిస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు. తనకెంత వీలైతే అంత క్రికెట్‌ణు ఆడగలను అని శ్రీశాంత్‌ అన్నాడు.
ప్రపంచం తనను అనుమానించినా తన అత్తమామలు నమ్మి కూతుర్నిచ్చి పెళ్లి చేశారని, అలాగే తన తల్లిదండ్రులు అండగా ఉన్నారని , విపత్కర సమయంలో నమ్మడం అంత సులువు కాదు, అందుకే అత్తమామలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.