ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సత్తాచాటిని హైదరాబాద్‌ అమ్మాయి…

హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌-16, అండర్‌-18 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోలోని కర్నల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న రెండు వయో విభాగాల్లోనూ విజేతగా నిలిచిన సంజన…..అండర్‌-18 కేటగిరీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ అండర్‌-18 డబుల్స్‌ కేటగిరీలో తన భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి ఛాంపియన్‌గా నిలిచింది. అండర్‌-16 బాలికల టైటిల్‌ పోరులో సంజన 6-4, 7-5తో రాధిక రాజేశ్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన తొలిరౌండ్‌లో 6-1, 6-3తో అనా వర్షిణి (ఉత్తర ప్రదేశ్‌)పై, ఫ్రీక్వార్టర్స్‌లో 6-0, 6-0తో వన్య అరోరా (మహారాష్ట్ర)పై, క్వార్టర్‌లో 6-2, 6-0తో క్రిస్టీ బోరో (అస్సాం)పై, సెమీస్‌లో సంజన 6-2, 6-1తో నియతి (ఉత్తరాఖాండ్‌)పై, విజయం సాదించింది. అండర్‌-16 విభాగంలో ఆదిపత్యం ప్రదర్శించిన సంజన…అండర్‌-18కేటగిరీ సింగిల్స్‌లో చివరి మెట్టుపై తడబడింది. ఫైనల్లో సంజన 4-6, 3-6తో గార్గి (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో 6-1, 6-1తో ఐరాసూద్‌ (తెలంగాణ)పై, ప్రిక్వార్టర్‌లో 6-1, 6-2తో క్రితిక (హరియాణా)పై, క్వార్టర్స్‌లో 6-1, 5-7, 6-4తో హర్లీన్‌కౌర్‌ (పంజాబ్‌)పై, సెమీస్‌ మ్యాచ్‌లో సంజన 6-4, 1-6, 6-1తో కశిష్‌ భాటియా (ఢిల్లీ)పై గెలుపొందింది. మరోవైపు డబుల్స్‌ విభాగంలో భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి సంజన టైటిల్‌ను సాధించింది. అండర్‌-18 బాలికల డబుల్స్‌ తుదిపోరులో సంజన-ఆర్నిరెడ్డి ద్వయం 7-6, 6-4తో పవిత్రారెడ్డి జోడీపై విజయం సాధించింది.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: