ఈ సారి హార్ధిక్‌ పాండ్యనే కీలకం

ప్రపంచకప్‌లో తన ఫేవరెట్‌ను చెప్పిన యువీ

hardhik pandya, yuvraj singh
hardhik pandya, yuvraj singh

యువ ఆల్‌రౌండర్‌, హార్డ్‌ హిట్టర్‌ హార్ధిక్‌ పాండ్య ఈ సారి భారత్‌ తరఫున కీలక ఆటగాడని 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌సింగ్‌ అన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మరిన్ని విశేషాలు పంచుకున్నాడు. ఈ సారి ఆటలో కొన్ని మార్పులు చేశారు. ఐదుగురు ఫీల్డర్ల సర్కిల్‌(30 గజాలు)లో ఉండాల్సి ఉంది. కానీ గతంలో ఇక్కడ నలుగురే ఉండేవారు. తనకు ఇండియా జట్టుపై బాగా నమ్మకం ఉందని, ఎంతటి లక్ష్యాన్నైనా చేధించగలరని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సారి ప్రపంచకప్‌ జట్టులో హార్ధిక్‌ పాండ్య కీలక ఆటడాడని యువీ తెలిపాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, బ్యాట్‌తో పాటు బంతితో రాణిస్తున్నాడు. ఇక టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌, కోహ్లి ,ధావన్‌ రాణిస్తే భారత్‌ మంచి స్కోర్లు సాధిస్తుందని యువరాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: