ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హిమదాస్‌కు చోటు

Himadas
Himadas


న్యూఢల్లీ: హిమదాస్‌కు పరిచయవాక్యాలు అవసరం లేదు. నెలవ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించి, అందరి ప్రశంసలు పొందుతున్నది. ఈ సమయంలో ప్రపంచ అథెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో హిమదాస్‌ చోటు సంపాదించింది. ఆమెతోపాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే 25 మంది క్రీడాకారుల జాబితాను భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రకటించింది. 400 మీటర్ల రేసు విభాగంలో హిమదాస్‌ అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈనెల 27 నుంచి అక్టోబరు 6 వరకు దోహాలో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/