బాలీవుడ్‌ నటితో హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌

Nataša Stankovic & hardik pandya
Nataša Stankovic & hardik pandya

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ బాలీవుడ్‌ నటి, సెర్బియాకు చెందిన నటాషా స్టాన్‌కోవిచ్‌తో జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబా§్‌ులో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్‌ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్‌ తొడిగాడు. ఆపై నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా..నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్‌ మొత్తానికి తెలియాలి అని క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుంది. ఎటువంటి సమాచారం లేకుండానే పాండ్యా నిశ్చితార్థం చేసుకోవడంతో క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్‌ కూడా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. హార్దిక్‌కు పలువురు క్రికెటర్లు విషెష్‌ తెలిజేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/