150 వికెట్ల క్లబ్‌లో చోటు సంపాందించిన హర్భజన్‌

Harbhajan Singh
Harbhajan Singh

విశాఖపట్నం: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన హర్భజన్‌సింగ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ వికెట్లు తీస్తూ విశేషంగా రాణించారు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 150 వికెట్ల క్లబ్‌లో చోటు సంపాదించాడు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ రూథర్‌ఫర్డ్‌ను పెవిలియన్‌కు పంపించి తన ఖాతాలో 150వ ఐపీఎల్‌ వికెట్‌ వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకం వల్లే ఈ ఘనత సాధించానని భజ్జీ పేర్కొన్నాడు. గతంలో నేను ఆడిన క్రికెట్‌కు ఇది పూర్తి భిన్నమైన ఫార్మాట్‌. అయితే, ఈ కొత్త ఫార్మాట్‌లోనూ 150 వికెట్లు తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిక్షణం నా బౌలింగ్‌కు మెరుగులు దిద్దుతూనే ఉంటాను. ఈ సంవత్సరం చాలా వికెట్లు తీశాను అని హర్భజన్‌సింగ్‌ తెలిపారు.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/