క్రిస్‌గేల్‌ మెరుపు సెంచరీ వృథా…

gayle
gayle


సెయింట్‌ కిట్స్‌: సొంత గడ్డపై కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సిపిఎల్‌)లో విండీస్‌ డాషింగ్‌ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిపిఎల్‌లో జమైకా తలావాస్‌ జట్టు తరపున ఆడుతున్న ఈ విధ్వంసకర ఓపెనర్‌ 62 బంతుల్లో 7ఫోర్లు, 10 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. గేల్‌ ఇంతలా విధ్వంసం సృష్టించినా తలావాస్‌ మాత్రం గట్టెక్కలేకపోయింది. గేల్‌తో పాటు చడ్విక్‌ వాల్టన్‌ (36 బంతుల్లో 3ఫోర్లు, 8 సిక్సర్లతో 73) కూడా బలౌర్లపై విరుచుకుపడ్డారు. వాట్లన్‌, గేల్‌ పరుగుల వరద పారించడంతో జమైకా సునాయాసంగా 200పరుగుల మార్క్‌ అందుకుంది. ఈ జోడి కేవలం 79 బంతుల్లో 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 18వ ఓవర్‌ ప్రారంభంలో వాల్టన్‌ ఔట్‌ అయినా, గేల్‌ తన నాలుగవ సిపిఎల్‌ సెంచరీని అందుకున్నాడు. జమైకా చివరి మూడు ఓవర్లలో 42 పరుగులు చేసింది. ఫాబియన్‌ అలెన్‌, అల్‌జారీ జోసెఫ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్‌ కిట్స్‌ విజయం సాధించడం కష్టమేనని అందరూ భావించారు. కానీ…సెయింట్‌ కిట్స్‌ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేసూ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ దేవన్‌ థామస్‌ (71), ఎవిన్‌ లూయిస్‌ (53) విరుచుకుపడటంతో సెయింట్‌ కిట్స్‌ లక్ష్యం దిశగా సాగింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/