ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రారంభంలోనే సంచలనం

మాజీ ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన 15 ఏళ్ల కోరి గౌఫ్‌

Coco Gauff
Coco Gauff

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రారంభమైన తొలి రోజే సంచలన విజయం నమోదైంది. అమెరికా టీనేజ్‌ గర్ల్ కోరి గౌఫ్‌ అద్భుత విజయాన్నందుకుంది. అమెరికాకే చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే మట్టికరిపించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల గౌఫ్‌ 76(5), 63తో వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. ఆద్యాంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న గౌఫ్‌.. వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించింది.. మంగళవారం జరిగే రెండో రౌండ్‌లో సొరానా సిర్‌స్టి(రొమెనియా)తో తలపడుతుంది. విలియమ్సన్‌ను ఓడించడం గాఫ్‌కు ఇది రెండో సారి. గతేడాది జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తొలి రౌండ్‌లోనే వినస్ విలియమ్స్‌ను గాఫ్ మట్టికరిపించింది. ఈ కోర్టు .. క్రౌడ్ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశానని గాఫ్ తెలిపింది. ‘వీనస్ బాగా ఆడింది. డ్రా చూసి నేను కొంత ఆశ్చర్యానికి లోనయ్యా. నిరూత్సాహపడ్డా. కానీ అదృష్టం కొద్ది విజయం సాధించా. చాలా గొప్పగా ఫీలవుతున్నా. వాస్తవానికి నాకు కావాల్సింది ఇదే. ఈ కోర్టు.. ఈ క్రౌడ్ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశా’అని ఈ అమెరికా టీనేజర్ తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/