కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతోషిస్తాడు

Sourav Ganguly
Sourav Ganguly

కోల్‌కతా: టీమిండియా ఈ నెల 22 నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించి తొలి మూడు రోజులకు టికెట్లు అమ్ముడుపోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూళీ సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని గ్రేట్‌ అంటూ కొనియాడాడు. గ్రేట్‌ విరాట్‌ కోహ్లి రాకతో ఈడెన్‌ గార్డెన్‌ గ్యాలరీలు హౌస్‌పుల్‌ అవుతాయి అని అన్నాడు. టెస్టు క్రికెట్‌కు అభిమానుల్ని తీసుకురావడం అంత తేలిక కాదు ఇది డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ కావడంతో ప్రెక్షకులు ఆసక్తి చూపుతున్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకున్నాడు. ఈడెన్‌ గార్డెన్‌లో ఏర్పాట్లు మైమరిపిస్తాయి తొలి మూడు రోజులు అభిమానులతో ఈడెన్‌ కిక్కిరిసిపోతుంది అని సౌరవ్‌ గంగూళీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ఇండియా నెగ్గి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన ప్రథమ స్థానాన్ని మరింత పదిల పరుచుకుంటందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/