కోహ్లీతో నేడే తొలి సమావేశం…

kohil and ganguly

ganguly and kohil

ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతో గురువారం తొలి సమావేశం కానున్నట్లు బిసిసిఐ తాజా అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగింది. బోర్డు మీటింగ్‌ అనంతరం గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఉందని, కెప్టెన్‌ కోహ్లీకి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించాడు. అదేవిధంగా ఎంఎస్‌ ధోనితో కూడా సమావేశం కానున్నట్లు తెలిపాడు. కోహ్లీతో గురువారం సమావేశమవుతాను. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కోహ్లీనే. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలు సాధించింది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయాలనేది కోహ్లీ తాపత్రయం. అతడికి అన్ని విధాల అండగా ఉంటాం. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/