బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్ దాఖలు

Sourav-Ganguly-files-nomination
Sourav-Ganguly-files-nomination

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం లాంఛనమే. కొద్దిసేపటి క్రితమే ముంబయిలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నది గంగూలీ ఒక్కరే. బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న నిర్వహించనున్నారు. నామినేషన్లకు అక్టోబరు 14 తుది గడువుగా విధించారు. వాస్తవానికి కర్ణాటకకు చెందిన బ్రిజేశ్ పటేల్ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయమని నిన్నటివరకు అందరూ భావించారు. కానీ, కొన్నిగంటల్లోనే పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ బీసీసీఐ చీఫ్ రేసులో ముందు నిలిచాడు.

ఇక, ఇతర పదవుల విషయానికొస్తే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శి పదవికి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారి పదవికి, కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయేశ్ జార్జ్ సంయుక్త కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, గంగూలీ రాకతో రేసు నుంచి తప్పుకున్న బ్రిజేశ్ పటేల్ ను ఐపీఎల్ చైర్మన్ గా చేసేందుకు పావులు చకచకా కదులుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/