లోధా సంస్కరణల్లో మార్పు

2024 వరకు బిసిసిఐ చీఫ్‌గా గంగూలీ

Sourav Ganguly
Sourav Ganguly

ముంబయి:బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలి తన మార్క్‌ను మరోసారిచూపించాడు. పదవి చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన డే/ నైట్ టెస్టు సన్నాహకాలు చేపట్టిన ఆయన సంస్థ తోలి సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో లోధా సంస్కరణల మార్పు చేపట్టాడు. ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన తొలి ఎజిఎం లో లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలపడమే మిగిలి ఉంది. ‘లోధా సంస్కరణల మార్పుకు ఆమోదం తెలిపారు. దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించాల్సి ఉంది’ అని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు గనుక ఆమోదిస్తే బిసిసిఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్.. మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలన్న లోధా కమిటీ షరతు ఇక ఉండదు.

బెంగాల్ క్రికెట్ సంఘం ఈధ్యక్షుడిగా ఆరేళ్ల పాటు పని చేసిన గంగూలి తొమిది నెలల్లోనే బిసిసిఐ అధ్యక్ష పదవిని వదిలిపెట్టాలిన అవసరం ఉండదు. దీంతో ఆయన 2024 వరకు బిసిసిఐ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అతడితో పాటే బిసిసిఐ కార్యదర్శి జైషా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకానరం ఈయన పదవీ కాలం కూడా ఏడాదికన్నా తక్కువే ఉంది. ఇదే కాకుండా భవిష్యతుత్తలో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సమావేశాల్లో బిసిసిఐ ప్రతినిధిగా జైషా పాల్గొంటారని కూడా సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు షా ఆ సమావేశాలకు వెళ్తారని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా బిసిసిఐ సలహా కమిటీ (సిఎసి)నియామకాన్ని బోర్డు వాయిదా వేసింది. డిసెంబర్ 3న జరగబోయే సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఈ కమిటీని నియమించడం జరుగుతుందని ఓ అధికారి చెప్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/