పాక్‌తో మ్యాచ్‌లో దృష్టంతా ఫీల్డింగ్‌పైనే

ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌

practice session
practice session

నాటింగ్‌హామ్‌: పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో ప్రధానంగా ఫీల్డింగ్‌పైనే దృష్టి పెడతామని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. కాని చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఏ చిన్న పొరపాటు ఆస్కారం ఇవ్వబోమనిన ఆయన తెలిపారు. కాగా పాక్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ సేన ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌తో సహా ఆటగాళ్లు ఈ విభాగంలో విఫలమవడంతో టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌లో ఈ తప్పులు చేయబోమని సర్ఫరాజ్‌ తెలిపాడు. ప్రతి మ్యాచ్‌లో మన ఫీల్డింగ్‌తో పాటు ప్రత్యర్ధుల ఫీల్డింగ్‌ పరిస్థితులను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలని, అలా అన్ని విభాగాల్లో అత్యుత్తమ స్థాయిలో బరిలోకి దిగితే విజయం వరిస్తుందని శ్రీధర్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/