శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం

sreesanth
sreesanth

కోచ్చి: భారతీయ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ ఇంట్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. కోచ్చిలోని ఎడపల్లిలోని శ్రీశాంత్ ఇంటిలోని కింది అంతస్తులో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి ఒక గది పూర్తిగా దగ్ధమైంది. ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీశాంత్ ముంబై వెళ్లగా ఆయన భార్య పిల్లలు, పనివారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు కనిపించడంతో పొరుగువారు వెంటనే అగ్నిమాపక అధికారులకు ఫోన్ చేయగా అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది గ్లాస్ వెంటిలేటర్ పగులగొట్టి ఇంట్లోని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తన భార్య, పిల్లలు మొదటి అంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని డ్రాయింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయని శ్రీశాంత్ తెలిపారు. సీలింగ్ ఫ్యానులో షార్ట్ సర్కూట్ ఏర్పడిన కారణంగానే మంటలు ఏర్పడినట్లు భావిస్తున్నారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/