యూటర్న్‌ తీసుకున్న ఫరూక్‌ ఇంజినీర్‌…

FAROOQ ENGINEER
FAROOQ ENGINEER

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ, బిసిసిఐ సెలెక్టర్లను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌ తీసుకున్నాడు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఫరూక్‌ మాట్లాడుతూ బాలీవుడ్‌నటి అనుష్కశర్మ, సెలక్షన్‌ కమిటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్ర దుమారం రేగడంతో అనుష్క, ఎంఎస్‌కె ప్రసాద్‌ ఖండించారు. ఈనేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఫరూక్‌ ఓ టివి ఛానెల్లో మాట్లాడుతూ తాను జోక్‌ చేశానని అన్నాడు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతున్నారని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. ఈ వివాదంలోకి అనుష్కశర్మను అనవసరంగా తీసుకొచ్చారని, ఆమె చాలా మంచి వ్యక్తి అని ఫరూక్‌ కొనియాడాడు. అలాగే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అద్భుత కెప్టెన్‌ అని, కోచ్‌ రవిశాస్త్రి బాగా పనిచేస్తున్నాడని మెచ్చుకున్నాడు. చిన్నవిషయాన్ని పెద్దదిగా చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని మాజీ క్రికెటర్‌ వ్యాఖ్యానించాడు. ఒకతను టీమిండియా బ్లేజర్‌ వేసుకోవడమే దీనికి కారణమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/