రవిశాస్త్రి ఎంపికపై మండిపడుతున్న అభిమానులు

 Ravi Shastri- Virat Kohli
Ravi Shastri- Virat Kohli

ముంబయి: బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రీనే కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని నాలుగోసారి ఎంపిక చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతరంగస్వామి కమిటీ ఏకగ్రీవ నిర్ణయంపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖఈ మాత్రం దానికి ఇంత హైరానా ఎందుకు. అతన్నే ఎంపిక చేయాలనుకున్నప్పుడు మిగిలిన వారికి ఇంటర్వ్యూలు చేయడం ఎందుకు?. ముందే ప్రకటించేస్తే సరిపోయేది కదాగ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈ నిర్ణయాన్నిజీర్ణించుకోలేకపోతున్న అభిమానులు ఘాటైన విమర్శలు చెస్తున్నారు. ఖటీమ్‌ ఇండియా 2015 వన్డే ప్రపంచకప్‌, 2016 టీ20 ప్రపంచకప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ కోల్పోయింది. ఇకపై 2020, 2021లలో జరిగే టీ20 ప్రపంచకప్‌లూ హుష్ కాకి అన్నమాట’ అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/