మంజ్రేకర్‌పై టీమిండియా అభిమానుల ఫైర్‌

sanjay manjrekar
sanjay manjrekar

ముంబయి: ఇటీవలి కాలంలో తరచూ నెటిజన్ల కోపానికి గురౌతున్న కామెంటేటర్‌ సంజయ్ మంజ్రేకర్‌ మరోసారి ట్రోలింగ్‌కు బలయ్యాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా..రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా టీ20 లో మరింత మెరుగవ్వాలంటే విండీస్‌తో మరిన్ని టీ20 సిరీస్‌లు ఆడాలని మంజ్రేకర్‌ ట్విట్టర్‌ వేదికగా సూచించాడు. దీనితో టీమిండియా అభిమానులు మంజ్రేకర్‌పై విపరీతంగా ట్రోలింగ్‌ చేశారు. ఒక్క మ్యాచ్‌లో తేడావస్తే టీమిండియా ఆటతీరును తక్కువ చేసి మాట్లాడతావా అని మండిపడుతున్నారు. కాగా ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై మంజ్రేకర్‌ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ..నువ్‌ హర్షాతో మరిన్ని కామెంటరీలు చేస్తే బాగుంటుందని టీమిండియా అభిమానులు సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/