అభిమాని గిఫ్ట్‌కు ఆశ్చర్యపోయిన కోహ్లీ

Virat kohli
Virat kohli

గువాహటి: పాత మొబైల్ ఫోన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించాడు అసోంకు చెందిన ఓ అభిమాని. దీన్ని చూసిన కోహ్లీ అతడి ప్రతిభకు ఆశ్చర్యపోయాడు. కోహ్లీకి ఆ అభిమాని ఈ చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానిపై కోహ్లీ ఆటోగ్రాఫ్ చేస్తుండగా తీసిన ఫొటోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని రూపొందించడానికి తనకు మూడు రోజులు పట్టిందని అభిమాని రాహుల్ పరెక్ చెప్పాడు. ‘మొబైల్ ఫోన్లు, వైర్లతో నేను ఈ చిత్రాన్ని గీశాను. మూడు రోజులు, మూడు రాత్రుళ్లు కష్టపడి దీన్ని పూర్తి చేశాను. కోహ్లీ సర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆయన నన్ను కలవడానికి వస్తున్నప్పుడు నా గుండె వేగం పెరిగింది. శ్రీలంకతో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కోహ్లీ గువాహటికి వస్తున్నాడని నాకు కొన్ని నెలల ముందే తెలిసింది’అని చెప్పాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/