అన్ని జట్లు భారత్‌ బౌలింగ్‌కు బేజారు

Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌-2019లో పాల్గొనే అన్ని జట్లు టీమిండియా బౌలింగ్‌ గురించి భయపడుతున్నాయి అని పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నారు. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు ఫేవరేట్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. భారత్‌ కొద్ది కాలంగా బౌలింగ్‌లో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా రాణిస్తున్నారు. ఐతే ఐపిఎల్‌లో ఏ బౌలర్‌ రాణించలేదు. మాజీలు ఫ్లాఫ్‌ ఐనా..ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రాణిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయమై పేసర్‌ భువనేశ్వర్‌ కూడా స్పందించాడు. బాగా రాణించిన ఆటగాడు కచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెడతారు. ఇంగ్లాండ్‌లో కొన్నాళ్లుగా పిచ్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లన్నీ టీమిండియా బౌలింగ్‌ గురించి భయపడుతున్నాయి. గత కొంత కాలంగా బౌలర్ల ప్రదర్శనే ఇందుకు కారణం. రోజు రోజుకు జట్టు బౌలింగ్‌ మెరుగవుతుంది. ఎలాంటి పిచ్‌ మీదయినా రాణించగలం అని భువి అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/