కెప్టెన్‌గా రాణించడంలో వారి సహకారం ఎంతో ఉంది

Shreyas Iyer
Shreyas Iyer

విశాఖపట్నం: విశాఖ వేదికగా శుక్రవారం నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలోకి వచ్చి ఆగింది. దీంతో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని జట్టుగా మిగిలిపోయింది. మ్యాచ్‌ అనంతరం ఆ జుట్టు కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఓటమిపై మాట్లాడాడు. మొదట్లో ధోని, రోహిత్‌ శర్మ, కోహ్లిలతో కలిసి మ్యాచ్‌లు ఆడితే తాను అదృష్టవంతుడినే అనుకునేవాడిని అని అలాంటిది వాళ్లతోపాటు కెప్టెన్‌గా టాస్‌లో పాల్గొనే అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని అన్నాడు. తనను తాను కెప్టెన్‌గా మెరుగుపరచుకోవడంలో వారి ముగ్గురి సహకారం ఎంతో ఉందని అన్నాడు. తమ జట్టు యాజమాన్యం సైతం కెప్టెన్‌గా తనకు ఇవ్వాల్సిన గౌరవం, మద్దతు విషయంలో ఎన్నడూ తగ్గలేదని, ఢిల్లీ జట్టుతో ప్రయాణం ఎన్నో అనుభూతులను మిగిల్చిందని అన్నాడు. చెన్నై జట్టులో మంచి స్పిన్నర్లున్నారని, వారి బౌలింగ్‌లో పరుగులు తీయడం అంత సులువైన విషయం కాదని, విశాఖ పిచ్‌ తమకు సహకరిస్తుందని అనుకున్నాం కాని అది జరగలేదని అన్నాడు. ఈ సీజన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నామని శ్రేయాస్‌ అయ్యర్‌ తెలిపారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/