టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లా

england vs bangladesh
england vs bangladesh


కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ X బంగ్లాదేశ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లు ఆడగా చెరో విజయం సాధించాయి. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. అలాగే 2015లో లీగ్‌ దశలో బంగ్లా చేతిలోనే ఓడిపోయి ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/