వరల్డ్‌కప్‌ తర్వాత వన్డేలకు దూరం

duminy
duminy


ముంబై: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ జెపి డుమిని అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికే అంశంపై స్పందిస్తూ.. 2019 వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటన చేశారు. టెస్ట్‌, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించుకుని, అప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. 2011, 2015 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డుమిని ఈ సారి కూడా బరిలోకి దిగబోతున్నాడు.
శ్రీలంకతో ఆఖరి ఐదో వన్డే శనివారం న్యూలాండ్స్‌ వేదికగా జనగనుంది. సొంతగడ్డపై డుమినికి ఇదే ఆఖరి మ్యాచ్‌ అవడం విశేషం. 2019 ఐపిఎల్‌ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ జట్టు జెపిని విడుదల చేయగా అతన్ని ఏ ఫ్రారఛైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 జట్టుకు డుమిని అందుబాటులో ఉండనున్నాడు

తాజా బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/