డోపింగ్‌ కేసులో బిసిసిఐకి ఊరట!


పృథ్వీషా విషయంలో క్లీన్‌చిట్‌

prduviraj shah
prduviraj shah


ముంబయి: డోపింగ్‌ భూతం క్రీడాకారుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఈ టెస్టులో పట్టుబడి ఇప్పటికే పలువురు క్రీడాకారులు ఆటకు దూరం అయ్యారు. మరికొందరిపై కేసులు నడుస్తున్నాయి. తాజాగా టీమిండియా యువకెరటం పృథ్వీషా, మరో ఇద్దరు క్రికెటర్ల డోపింగ్‌ కేసుల ప్రక్రియకుప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా) క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిపై విధించిన 6-8 నెలల నిషేధం సబబుగానే ఉందని వెల్లడించింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సమయంలో దగ్గుతో బాధపుతున్న షా బోర్టుకు చెప్పకుండా ఔషధ దుకాణంలో ఓ దగ్గుమందుకొని వాడాడు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉంది. ఈ విషయాన్ని ముస్తాక్‌ అలీ బోర్డుకు తెలుపలేదు. దీంతో కెరీర్‌లో కోలుకోలేని దెబ్బతిన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. https://www.vaartha.com/news/national/