బిసిసిఐకి క్షమాపణలు చెప్పిన దినేశ్‌ కార్తీక్‌…

dinesh karthik
dinesh karthik


న్యూఢిల్లీ: బిసిసిఐ నిబంధనలు ఉల్లంఘించడంపై భారత సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ అయిన కార్తీక్‌…కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సిపిఎల్‌)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం…బిసిసిఐకి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బిసిసిఐ అనుమతి తీసుకోకుండా ఈమ్యాచ్‌లకు హాజరు కావడంపై బోర్డుకు బేషరతుగా కార్తీక్‌ క్షమాపణలు చెప్పారు. బిసిసిఐ అనుమతి లేకుండానే సిపిఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేంందుకు వెళ్లిన కార్తీక్‌…అక్కడ ట్రిన్‌బాగో జట్టు జెర్సీధరించి…ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని…సిపిఎల్‌ మ్యాచ్‌లను తిలకించాడు. ట్రిన్‌బాగో జట్టు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ది కావడం…అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపిఎల్‌లో దినేశ్‌ కార్తీక్‌ సారథిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా సిపిఎల్‌ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కార్తీక్‌ కనిపించడంతో అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ బిసిసిఐ సిఈఓ రాహుల్‌ జోహ్రీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/h