ప్రణవ్‌ లక్ష్యం ధోనీ 183 ఆటోగ్రాఫులు

MS Dhoni
MS Dhoni

కోల్‌కతా: టీమిండియాకు 183 కు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ 183 తో ప్రపంచకప్‌ సాధించింది, టీమిండియాకు చెందిన చాలామంది అత్యధిక స్కోరు కూడా 183. అంతేకాకుండా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఎంఎస్‌ ధోనీ వన్డేల్లో చేసిన అత్యధిక స్కోరు కూడా 183. అందుకే బెంగళూరుకు చెందిన మహీ వీరాభిమాని ప్రణవ్‌ జైన్‌ అతడినుంచి 183 ఆటోగ్రాఫ్‌లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రణవ్‌ దగ్గర 153 ఆటోగ్రాఫులు ఉండగా ఈ సారి కనీసం 10 ఆటోగ్రాఫులైనా సేకరించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మహీ తనకు 183 ఆటోగ్రాఫులు ఇస్తానని, కాకాపోతే ఒక షరతు విధించాడని చెప్పుకొచ్చాడు. 183 ఆటోగ్రాఫులు ఇచ్చిన తర్వాత తనకు మరో ఆటొగ్రాఫ్‌ దొరకదని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే తన లక్ష్యం నెరవేరేందుకు మరో సంవత్సరం పడుతుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ కపిల్‌ దేవ్‌ తో కలిసి ఒక వాణిజ్య ప్రకటన నేపథ్యంలో కోల్‌కతాకు వచ్చాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/