ధోని కారణాలు తెలుసుకునేందుకు మైదానంలోకి వెళ్లాడు : ఫ్లెమింగ్‌

Stephen Fleming
Stephen Fleming

జైపూర్‌: సవా§్‌ు మాన్‌సింగ్‌ మైదానం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని ప్రవర్తించిన తీరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకుగాను జరిమానా కింద ధోనికి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత పడింది. అయితే ధోని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెన్నై సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ వివరణ ఇచ్చాడు. బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించిన తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అసలు అది నోబాలా కాదా…? అన్న అయోమయం అందరిలో నెలకొంది. ఆ తర్వాత అది నోబాల్‌ కాదని అంపైర్లు స్పష్టం చేశారు. దీంతో అంపైర్ల నిర్ణయానికి గల కారణాలు తెలుసుకునేందుకు ధోని నేరుగా మైదానంలోకి వెళ్లి వారితో మాట్లాడాడు. ఇప్పుడు ధోని గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు. ధోని కూడా దీనిపై పునరాలోచిస్తాడు. అయితే, మైదానంలో జరిగే తప్పొప్పుల గురించి అంపైర్లు మాత్రమే మాట్లాడాలని నా అభిప్రాయం అని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. ధోని చేసింది తప్పా…ఒప్పా..అనే ప్రశ్నకు మాత్రం ఫ్లెమింగ్‌ సరైన సమాధానం ఇవ్వలేదు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/