ధోని హద్దులు దాటి ప్రవర్తించాడు…

MS Dhoni
MS Dhoni

జైపూర్‌: మైదానంలో అంపైర్లతో దురుసుగా ప్రవర్తించిన తీరుకు ధోనికి పడిన శిక్ష చాలా చిన్నదని మాజీ క్రికెటర్‌ సంజ§్‌ు మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద ధోనికి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధిస్తూ ఐపిఎల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇది చాలా చిన్న శిక్ష అని…ధోని తన హద్దుఉ దాటి ప్రవర్తించాడని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. కాకపోతే అన్ని సందర్భాల్లోనూ అదృష్టం ధోని వెంటే ఉంటోందన్నాడు. ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు. మంజ్రేకర్‌ ప్రస్తుతం క్రికెట్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే, ధోని తీరుపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని చేసింది ముమ్మాటికీ తప్పేనని దుయ్యబడుతున్నారు. ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌ మార్క్‌వా స్పందిస్తూ…ఐపిఎల్‌లో ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఒత్తిడి ఉంటుందని నాకు తెలుసు. కానీ ఇద్దరు కెప్టెన్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, ధోని చర్యలు ఏమాత్రం మంచి పరిణామాలు కావని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ కూడా కొంచెం ఘాటుగానే స్పందించాడు. ఒక కెప్టెన్‌గా నువ్వు అంపైర్లను గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ సంఘటన క్రికెట్‌లో ఒక ఉదాహరణగా మిగిలిపోతుందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐపిఎల్‌ నిబంధనలు ఉల్లంఘించిన ధోనికి మ్యాచ్‌ ఫీజులో కోత పడగా చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు క్రీడాస్పూర్తి పట్టికలో పాయింట్లు తక్కువయ్యే అవకాశం ఉంది.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/