ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ధోని…

MS Dhoni
MS Dhoni


జైపూర్‌: ధోనికి జరిమానా పడింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే, ధోని చర్యను ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన రెండో స్థాయి నేరంగా పరిగణిస్తూ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రీడాస్పూర్తిని దెబ్బ తీసినందుకు గాను ఐపిఎల్‌ యాజమాన్యం ఆర్టికల్‌ 2.20 ప్రకారం శిక్షలు విధిస్తుంది. ధీంతో ధోని మ్యాచ్‌ పీజులో 50శాతం కోత పడింది. జైపూర్‌ వేధికగా గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. 155పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నైకి ఆఖర్లో మూడు బంతులకు 9 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న శాంట్నర్‌కు రాజస్థాన్‌ బౌలర్లు బెన్‌స్టోక్స్‌…వికెట్ల కంటే ఎత్తులో బంతిని విసిరాడు. మైదానంలో అంపైర్లుగా ఉన్న ఉలాస్‌ గాండే, బ్రూస్‌ ఆక్స్‌ఫర్డ్‌ తొలుత నోబాల్‌గా ప్రకటించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. దీంతో డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి ఆవేశంగా వచ్చి అంపైర్లతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. అందుకు గానూ ధోనికి ఐపిఎల్‌ యాజమాన్యం జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాటు ధోని కెప్టెన్‌గా ఐపిఎల్‌లో 100విజయాల మైలురాయిని అందుకున్నాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/