ఐపిఎల్‌ ప్రాక్టీస్‌లో ఉతికారేసిన వార్నర్‌

కోల్‌కతా: ఐపిఎల్‌ 2019 సీజన్‌ ముంగిట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో డేవిడ్‌ వార్నర్‌ అర్థశతకంతో ఉత్సాహం నింపాడు. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో గత ఏడాది వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సిఏ) 12 నెలలు నిషేధం విధించగా…2018 ఐపిఎల్‌ సీజన్‌ మొత్తానికి ఈ ఓపెనర్‌ దూరమయ్యాడు. అయితే….అతనిపై ఉన్న నిషేధం ఈ నెల 28తో ముగియనుండగా…ఐపిఎల్‌లో రీఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వార్నర్‌…తాజాగా జరిగిన జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కేవలం 38బంతుల్లోనే 65 పరుగులతో చెలరేగాడు. మార్చి 23 నుంచి ఐపిఎల్‌ 2019 సీజన్‌ మొదలుకానుండగా…24న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలిమ్యాచ్‌లో ఢీకొనబోతుంది.ఐపిఎల్‌ సన్నద్ధతలో భాగంగా రెండు జట్లుగా విడిపోయి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌…ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడగా…సన్‌రైజర్స్‌ ‘ఏ జట్టుకి ఆడిన వార్నర్‌ మెరుపు అర్థశతకం బాదేశాడు. అతనితో పాటు మనీశ్‌ పాండే కూడా 43 బంతుల్లో 67 పరుగులు, దీపక్‌ హుడా 27బంతుల్లో 55 పరుగులు చేయడంతో ‘ఏ జట్టు రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇటీవల మోచేతి గాయం కారణంగా కొన్నిరోజులు ప్రాక్టీస్‌కి దూరంగా ఉన్న వార్నర్‌…ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో ఫిట్‌నెస్‌ని కూడా నిరూపించుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో హిట్టర్‌ యూసఫ్‌ పఠాన్‌, రికీ భు§్‌ు అర్థశతకాలు సాధించడంతో 18.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ ‘బి టీమ్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో రికీభు§్‌ు 29బంతుల్లోనే 65 పరుగులు చేయడం విశేషం.

https://www.vaartha.com/news/sports/మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.