ప్రతి టోర్నీలో టైటిల్‌ గెలవాలనే ఒత్తిడి ఉంటుంది

ఓడినప్పుడు విమర్శలు వస్తుంటాయి కానీ అవి నాపై పనిచేయవు

pv sindhu
pv sindhu

న్యూఢిల్లీ: టోక్యో ఒలంపిక్స్‌లో పతకం గెలవడమే లక్ష్యంగా తాను సన్నద్ధమవుతున్నానని భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు. ఆటలో పాల్గొన్న ప్రతి టోర్నీలో టైటిల్‌ గెలవాలనే ఒత్తిడి తనపై ఉంటుందని అన్నారు. ఓడినప్పుడు విమర్శలు వస్తుంటాయని అయితే అవి తనపై పనిచేయవని సింధు పేర్కొంది. గతేడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచాక సింధు పెద్దగా రాణించని సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో విశ్వక్రీడలు జరగనున్నాయి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ప్రదర్శన తన కెరీర్‌లో గొప్పది. అయితే తర్వాత కొన్ని టోర్నిల్లో తొలి రౌండ్లలోనే ఓడాను. కానీ అన్ని మ్యాచ్‌ల్లో అన్న సార్లూ గెలవడం సాధ్యంకాదు. కొన్ని సార్లు చాలా నేర్చుకుంటా. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లడానికి రెట్టించిన ఉత్సహంతో మళ్లీ పోరాడడానికి ఇది ఎంతో ముఖ్యం అని తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/