యువ క్రికెటర్‌ పృథ్వీషాకు షాక్‌

Prithvi Shaw
Prithvi Shaw

ముంబయి: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీషాకు బీసీసీఐ షాక్‌ ఇచ్చింది. డోపింగ్‌ పరీక్షలో విఫలమైన అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది. సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా అతడికి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబయి క్రికెట్‌ సంఘం అనుబంధ ఆటగాడైన పృథ్వీషా నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తేలింది. షా మూత్రం నమూనాల్లో ఖటర్బుటలైన్‌గ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్‌ ఆర్టికల్‌ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/