పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకిన భారత్

Cricket World Cup

ఆస్ట్రేలియాపై విజయంతో భారత్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో విజయం సాధించి, ఒక మ్యాచ్ లో పరాజయం పాలైన ఇంగ్లాండ్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ కంటే ఇంగ్లాండ్ రన్ రేట్ కొంచం ఎక్కువగా ఉండటంతో పాయింట్లు సమానంగా ఉన్నా రెండో స్థానంలో నిలిచింది.