వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌

warm up matches
warm up matches

లండన్‌: ఇంగ్లాండ్‌ వేదికగా మే 30 నుంచి ఐసిసి వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఐతే వరల్డ్‌కప్‌కు ముందు కొన్ని జట్టు ఇంగ్లాండ్‌ పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు వార్మప్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. మే 24 నుంచి మే 28 వరకు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున వార్మప్‌ మ్యాచులు జరగనున్నాయి. ఇక భారత్‌ మే 25న న్యూజిలాండ్‌తో, మే 28న బంగ్లాదేశ్‌తో రెండు వార్మప్‌ మ్యాచులు ఆడనుంది.
వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌:

  • మే 24: పాకిస్థాన్‌ x ఆఫ్ఘనిస్తాన్‌, బ్రిస్టల్‌
  • మే 24: శ్రీలంక x సౌత్‌ఆఫ్రికా, కార్డిఫ్‌
  • మే 25: ఇంగ్లాండ్‌ x ఆస్ట్రేలియా, సౌతాంప్టన్‌
  • మే 25: ఇండియా x న్యూజిలాండ్‌, ది ఓవల్‌
  • మే 26: సౌతాఫ్రికా x వెస్టిండీస్‌, బ్రిస్టల్‌
  • మే 26 పాకిస్థాన్‌ x బంగ్లాదేశ్‌, కార్డిఫ్‌
  • మే 27: ఆస్ట్రేలియా x శ్రీలంక, సౌతాంప్టన్‌
  • మే 27: ఇంగ్లాండ్‌ x ఆఫ్ఘనిస్తాన్‌, ది ఓవల్‌
  • మే 28: వెస్టిండీస్‌ x న్యూజిలాండ్‌, బ్రిస్టల్‌
  • మే 28: బంగ్లాదేశ్‌ x ఇండియా, కార్డిఫ్‌

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/