వరల్డ్‌ కప్‌ వేళ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

Google
Google

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ సమరం ఈరోజు నుండి ప్రారంభం కానున్న సందర్భంగా గూగుల్‌ ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ‘Google’ అన్న అక్షరాల్లో ‘o’ అక్షరాన్ని బంతితో ‘L’ అక్షరాన్ని  వికెట్స్‌తో, మధ్యలోంచి బౌలర్‌ బంతి వేస్తున్నట్లుగా డూడుల్‌ను డిజైన్‌ చేసింది. ఈ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో పది జట్లు రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. ఈరోజు ఓవల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే ప్రత్యేకమైన రోజుల్లో, పండుగ వేళల్లో గూగుల్‌ ఇలా ఆకర్షణీయమైన డూడుల్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/