2028 ఒలింపిక్స్‌లో క్రికెట్?

cricket
cricket

లండన్: ప్రపంచ మెగా క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు లభిస్తుందా అంటే అవుననే సమాధానమే లభిస్తుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రయత్నాలు చేస్తోందని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్ మైక్ గాటింగ్ పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరింది. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయిందని ఆయన తెలిపాడు. ఓ క్రీడా ఛానెల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించామని ఐసీసీ కొత్త ముఖ్య కార్యదర్శి మనుసావ్నే ఎంసీసీ కమిటీతో అన్నాడని గాటింగ్ వివరించాడు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/