దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్‌: కోహ్లీ

virat kohli & ravi shastri
virat kohli & ravi shastri

ఢిల్లీ: టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రిపై సోషల్‌ మీడియాలో ఓ అజెండా ప్రకారమే ట్రోలింగ్‌ చేస్తున్నారు. అయితే అవేమి ఆయనపై ఏ మాత్రం ప్రభావం చూపవని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇటీవలి కాలంలో శాస్త్రి స్లీపింగ్‌ ఫొటో, బీచ్‌ ఫొటోలపై కొందరు విపరీతంగా ట్రోలింగ్‌ చేశారు. కోహ్లీ చెప్పిన ప్రతి మాటకు తలుపూతాడనే అపవాదులు కూడా వచ్చాయి. అయితే విటన్నింటిని కోహ్లీ కొట్టిపారేశాడు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. ట్రోలింగ్‌ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే శాస్త్రి ఇలాంటివి పట్టించుకొనే వ్యక్తికాదు. స్పిన్నర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన శాస్త్రి వేగంగా ఎదిగాడు. పదో స్థానం నుంచి ఓపెనింగ్‌ చేశాడు. సగటు 41 సాధించాడని విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. శాస్త్రి 1985లో వరల్డ్‌ సిరీస్‌ క్రికెట్‌లో ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ పురస్కారం అందుకున్న సంగతిని కోహ్లీ గుర్తుచేశాడు. ఇంటివద్ద కూర్చొని ట్రోలింగ్‌ చేసేవాళ్లని ఆయన పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని ట్రోల్‌ చేయాలనుకుంటే లేచి, బౌలర్లను ఎదుర్కొని, ఆయన సాధించిన ఘనతలు సాధించండని ట్రోల్‌ చేసే వారికి విరాట్‌ కోహ్లీ కౌంటర్‌ ఇచ్చాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/