2022 ఆసియా క్రీడల్లో చెస్

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో చెస్‌ మెడల్‌ ఈవెంట్‌గా పునరాగమనం చేయనుంది. వరుసగా 2006 ధోహా 2010 గ్యాంగ్‌జూ ఆసియా క్రీడల్లో పతకాంశంగా ఉన్న చెస్‌ను ఆ తర్వాత రెండు ఆసియా క్రీడల్లో నిర్వహించలేదు. అయితే 2022లో చైనాలోని హౌంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్‌ను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ అధికారికంగా ఆసియా చెస్‌ సమాఖ్యకు సమాచారం ఇచ్చింది. 2022లో సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి.

మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/sports/