ఘనంగా ఐసిసి వరల్డ్‌కప్‌ ప్రారంభ వేడుకలు!

world cup 2019 opening ceremony
world cup 2019 opening ceremony

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. వరల్డ్‌కప్‌ ఆరంభ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది. ఈ ప్రారంభ వేడుకలు బుధవారం రాత్రి 9.30 గంటలకు లండన్‌లోని మాల్‌ రోడ్‌లో జరగనున్నాయి. ఆరంభ వేడుకలను అటు ఐసిసితో పాటు వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. సుమారు గంటపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను పలు ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్నాయి.
అతిథులు: రాజకుటుంబం నుంచి క్వీన్‌ ఎలిజబెత్‌ 11 ముఖ్యఅతిథి, ఇంకా ప్యాలెస్‌ నుంచి పలువురు అతిథులు. ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి దేశం నుంచి ఓ క్రికెట్‌ లెజెండ్‌తో పాటు ఓ సెలబ్రెటీ స్జేజిపై ఉండనున్నారు. 10 జట్లకు చెందిన ఆటగాళ్లు ఈ వేడుకలకు హాజరు కావడం లేదు.
రాత్రి 9.30 గంటలకు, స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ కోసం హాట్‌స్టార్‌.కామ్‌
వరల్డ్‌కప్‌లో మొత్తం 46 రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐతే డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు, డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు మాత్రం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/